telugu navyamedia
రాజకీయ వార్తలు

ఏఐఎంఐఎం అతివాద పార్టీ.. ఒవైసీపై మమత విమర్శలు

mamatha benerji

హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న ఏఐఎంఐఎం పార్టీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ…ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఏఐఎంఐఎంను అతివాద పార్టీగా అభివర్ణించారు. ఇటువంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలను కోరారు.అలాగే, హిందూ అతివాద శక్తుల పట్ల కూడా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. 2011 నుంచి పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు జరుపుతుండడంతో టీఎంసీ కూడా ఇప్పటి నుంచే తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Related posts