telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాస్త బాధ్యతతో ఉంటే మంచిది… సోనమ్ కపూర్ పై రష్మీ ఫైర్

rashmi goutam movie sivaranjani trailer

టాలీవుడ్ యాంకర్ రష్మీ.. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ చేసిన ఓ పనికి ట్విట్టర్ ద్వారా క్లాస్ పీకే ప్రయత్నం చేసింది. ‘‘నేను ఓ చాకోలెట్ కేక్ చేశాను. నేను చేయాలనుకున్న టైమ్‌కి ఇంట్లో చాక్‌లెట్ లేకపోతే ఓ పుడ్ సప్లయ్ సంస్థ నాకు చాలా క్వాలిటీ గల చాక్ లెట్‌ను పంపింది. చాక్లెట్ పంపించి నాకు సహకరించిన వారికి ధ‌న్య‌వాదాలు’’ అని సోనమ్ కపూర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. సోనమ్ కపూర్ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన రష్మీ.. “సెలబ్రిటీ హోదా ఏదైనా చేయాలనిపిస్తుంది. అన్నీ సమకూర్చుకోగలమని కూడా అనుకుంటారు. కాకపోతే కాస్త బాధ్యతతో ఉంటే మంచిది. చాక్‌లెట్ డెలీవరీ కోసం ప్రజలను రోడ్లపైన తిప్పాలనుకోవడం కరెక్ట్ పద్దతి కాదు. అలాగే నీ అవసరం కోసం దుకాణాలు తెరిపించడం వంటివి కూడా ప్రస్తుత పరిస్థితులలో కరెక్టేనా అనేది ఆలోచించాలి..” అని సోనమ్‌ ట్వీట్‌కు రష్మీ బదులిచ్చింది.

Related posts