కేందం పై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పై సికింద్రాబాద్ బీజేపీ నేత బండారు దత్తాత్రేయ స్పందించారు. బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపుతోందనడం సరికాదని, గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ.2లక్షల కోట్లు వచ్చాయని తెలిపారు. కేంద్రంపై కేటీఆర్ వ్యాఖ్యలు సత్యదూరమని దత్తాత్రేయ విమర్శించారు.
శబరిమల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ వ్యతిరేకించడంలేదని, ప్రభుత్వమే బలవంతంగా ఇద్దరు మహిళలను ఆలయంలోకి పంపిందని మండిపడ్డారు. కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని దత్తాత్రేయ హెచ్చిరించారు.
వైసీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయం: గల్లా జయదేవ్