లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వివిధ రంగాల కార్మికులు, రోజువారీ కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. లాక్‌డౌన్‌తో చేనేత రంగం కుదేలైందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు పూట గడవడం కష్టంగా మారిందన్నారు.
ప్రభుత్వం తక్షణసాయంగా ప్రతి చేనేత కుటుంబానికి రూ.10వేలు సాయం చేయాలని డిమాండ్ చేశారు. నేతన్న నేస్తం పథకాన్ని కొందరికే పరిమితం చేయకుండా నేత వృత్తిపై ఆధారపడ్డ అందరికీ వర్తింపజేయాలన్నారు. టీటీడీ ఔట్‌సోర్సింగ్ కార్మికుల కొనసాగింపు సముచిత నిర్ణయమని పవన్ హర్షం వ్యక్తం చేశారు.