telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

“మాతృదేవోభవ “అమ్మ కడుపు అందమైన గర్భాలయం..

అమ్మ ఒడి అందమైన దేవాలయం..
అమ్మ కడుపు అందమైన గర్భాలయం..
అమ్మ ప్రేమ మధురం..
అమ్మ చేతి వంట స్వర్గం..
అమ్మ స్పర్శ మమకారపు ఊయల..
బెంగపడి, చెమ్మగిల్లిన కన్నులకు,
ఊరట అమ్మ చీర చెంగు..
అల్లరి చేసిన చేసినా, మారాము చేసినా,
అమ్మ చుట్టూ చేరి విసిగించినా,
రాని అమ్మ ప్రేమలో మార్పు..
పొత్తిళ్లలో పొదువుకున్న అమ్మ ప్రేమను,
నిలువెత్తు ధనం పోసినా కొనలేనిది..
నిలువెత్తు దానం చేసినా దొరకనిది..
బిడ్డ ఏడుపు మొదలవగానే తల్లడిల్లిపోయో అమ్మ, కారణమేంటో! అని ఒక్క సెకనులో
వంద కారణాలను యోచిస్తుంది..
అహోరాత్రులు మొత్తం అమ్మ చూపులు బిడ్డ పైనే..!
కలత నిద్రలతో కావడి కాస్తూ,
కొసరి కొసరి తినిపిస్తూ,
దిష్టేల తగులుతుందేమోనని,
నిరంతరం దిష్టి తీస్తూ,
ఒంటినిండా దిష్టి చుక్కలతోనూ,
తన దిష్టిని కూడా తీసి,
నిలువెల్లా మురిసిపోయేదే పిచ్చి అమ్మ..!!
అమ్మ ప్రేమను కొనగలమా ? అంగట్లో..!!
అమ్మ దీవెన దొరకగలదా? ఈ జగతిలో..!!
అమ్మఒడికి దూరమైన ప్రతి ఒక్కరూ అనాథలే ఈ సృష్టిలో!
రుణం తీర్చుకోలేని వ్యక్తులు
ఈ సృష్టిలో అమ్మ నాన్న ఇద్దరే..!!
సృష్టిలోని అమ్మలందరికీ ధన్యవాదములు..!!

Related posts