telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గ్రీన్ టీ తాగుతున్నారా…. అయితే ఇవి తెలుసుకోండి !

గ్రీన్ టీ లోని కెటాచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరపు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. గ్రీన్ టీ లో అధికంగా ఉండే ఈజీసీజీ అనే కెటాచిన్ కేన్సర్, మధుమేహం రాకుండా చూస్తాయి. ఇవి కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తాయి. మిగిలిన రకాల తేయాకును శుద్ధి చేసే క్రమంలో ఈ కెటాచిన్ తొలగిపోయినా గ్రీన్ టీ విషయంలో మాత్రం అలా జరగదు గనకే గ్రీన్ టీ తాగిన వెంటనే శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. గ్రీన్ టీ, కొన్ని ఔషధ మూలికలు కలిపి చేసే హెర్బల్ టీని పలు దేశాల్లో ఔషధంగా వాడతారు.

ఉపయోగాలు

* రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగేవారిలో హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. చెడు కొలెస్ట్రాల్ కూడా దరిచేరదు.
* గ్రీన్ టీ గుండెలోని ఎండో థెలియం పొరను కాపాడి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.
* శారీరక శ్రమ లేని వారు రోజూ గ్రీన్ టీ తాగితే అధిక క్యాలరీల గొడవ ఉండదు.
* ఆరోగ్యంతో బాటు గ్రీన్ టీ చర్మ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.3 చెంచాల మయోనైజ్, చెంచా గ్రీన్ టీ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కొంటే చర్మానికి బిగువు రావటమే గాక మొటిమల బెడద కూడా తొలగిపోతుంది.
* రోజూ వాడే ఫేస్ క్రీమ్ లో గ్రీన్ టీ పొడి కలిపి ముద్దగా చేసి ముఖ చర్మంలోకి ఇంకేలా వలయాకారంలో మర్దన చేసి ఆరిన తర్వాత ముఖాన్ని నీటితో కడిగితే చర్మం మెరిసిపోతుంది.
* ఊబకాయులు ఆకలి వేసినప్పుడు ఓ అరకప్పు గ్రీన్ టీ తాగితే ఆకలి తగ్గి తక్కువ ఆహారం తీసుకొంటారు. భోజనం తర్వాత మరో అర కప్పు తీసుకుంటే అదనపు కొవ్వు కరుగుతుంది.
* గ్రీన్ టీ శరీరం లో కార్బోహైడ్రేట్స్ విడుదలను ఆలస్యం చేసి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. కొవ్వు కణాల్లో చక్కెర చేరకుండా చేస్తుంది.
* మధుమేహులు రోజుకో రెండు కప్పులు గ్రీన్ టీ తాగితే సమస్య అదుపులో ఉంటుంది. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటే రోజుకో 2 కప్పులు గ్రీన్ టీ తాగితే మధుమేహం రావటం ఆలస్యం అవుతుంది.
* పెద్దపెగుల్లోని హానికారక బ్యాక్టీరియాను ఎదుర్కోవటమే గాక గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలకూ విరుగుడుగా పనిచేస్తుంది.
* కేన్సర్ నివారిణిగా పనిచేస్తూనే, కేన్సర్ రోగుల్లో ఆరోగ్యకరమైన కణాలను బలోపేతం చేస్తుంది.
* శరీరంలోని ఫ్రీ రాడికల్స్ పీచమణచి ఒత్తిడి నుంచి విముక్తం చేస్తుంది.
* పొగ తాగాలనే కోరికను గ్రీన్ టీ గణనీయంగా తగ్గిస్తుంది.
* మెదడులోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడకుండా చూస్తుంది. వృద్దుల్లో అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
ఎముకల బలోపేతానికి దోహదపడుతుంది. కీళ్ళ నొప్పులను దూరం చేస్తుంది.

Related posts