సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర ఉద్యోగులు, అధికారుల బదిలీలలో జోక్యం చేసుకుంటున్నారని బీజేపీ అగ్రనేతలకు సమాచారం చేరడంతో తండ్రీ కొడుకులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు కుమారుడు విజయేంద్రను బహిరంగంగా కనిపించొద్దని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. లండన్ నుంచి వచ్చిన రవాణా నిపుణులు బెంగళూరు ట్రాఫిక్‌పై బీ-ప్యాక్ ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో విజయేంద్ర పాల్గొన్నారు. ఈ విషయమై పార్టీలో చర్చలకు కారణం అవుతుండగా ముఖ్యమంత్రి యడియూరప్ప అప్రమత్తమయ్యారు.
బహిరంగంగా కనిపించరాదని అధికారిక నివాసానికి ఎక్కువగా రాకూడదని సూచించినట్టు తెలుస్తోంది. బీజేవైఎంలో కొనసాగుతున్నందున అదే పదవి ద్వారా పార్టీలో ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనవచ్చునని అంతకు మించి ఇతరత్రా వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుందని మందలించినట్టు తెలుస్తోంది.
అన్ని ప్రాంతాలకు పులివెందుల గ్యాంగులు: బుచ్చయ్య చౌదరి