telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త…

Ration card telangana

తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్‌తో మరోసారి ప్రజలంతా కష్టాల్లోకి వెళ్లిపోతున్నారు. కరోనా కష్టకాలంలో ఆదుకున్నందుకు మరోసారి సర్కార్ సిద్ధమవుతోంది. ప్రజలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రైవేట్ టీచర్లకు ఉచితంగా సన్నబియ్యం, రెండు వేల రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి రేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల కోటా బియ్యం ఇవ్వనుంది. ఈ మేరకు వచ్చే నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 82.50 లక్షల రేషన్‌ కార్డుదారులకు 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నది.

Related posts