telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

44ఏళ్ళ వయసుకే.. 40మంది పిల్లలు.. ఫామిలీ ప్లానింగ్ గురించి చెప్పండ్రా.. బాబూ..

women got 40 children on 44 years of age

ఓ మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలను కంటుంది. మహా అయితే పదిమంది అనుకోవచ్చు. ఎందుకంటే మహిళలు 40 ఏళ్ల తరువాత పిల్లలు కనడం కుదరదు. అంతెందుకు.. ఇప్పటి రోజుల్లో ఒక్కరు లేదంటే ఇద్దర్ని కనే సరికి చేతులెత్తేస్తున్నారు. అదే పూర్వం రోజుల్లో అయితే.. వేరుగా ఉండేది. అయితే, ఓ మహిళ మాత్రం 44 సంవత్సరాల వయసులోనే ఏకంగా 40 మంది పిల్లల్ని కన్నది. అది ఇప్పటి వరకు ఓ రికార్డ్ గా నిలిచిపోయింది. ఆమెకు తన 12 ఏటనే వివాహం జరిగింది. 13 ఏట గర్భవతి అయ్యింది. హాస్పిటల్ కు వెళ్లి చూపించుకుంటే.. ఆమె గర్భాశయం చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. చాలా పెద్దగా ఉన్నది. అందులోని అండాశయాలు కూడా పెద్దవిగా ఉన్నాయి. దాన్ని తొలగించడం జరగదని, అలా చేస్తే ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు.. ఓ సీక్రెట్ కూడా చెప్పారు.

ఆమెకు కవలలు పుడతారని కూడా చెప్పారు. చెప్పినట్టుగానే ఆమెకు మొదటిసారి కవలలు పుట్టారు. అక్కడితో ఆగలేదు.. ఆ తరువాత ఐదుసార్లు ఆమెకు కవలలు పుట్టారు. ఏడుసార్లు ముగ్గురేసి, ఐదుసార్లు నలుగురు చొప్పున పిల్లలు పుట్టారు. అలా మొత్తం 40 మంది సంతానం. అందులో ఇద్దరు పుట్టినప్పుడే చనిపోగా ఇప్పుడు 38మంది ఉన్నారు. వారందరిని ఆమె చాలా జాగ్రత్తగా సాకుతున్నది. ప్రతిరోజు వాళ్ళకోసం రెక్కలు ముక్కలు చేసుకుంటోంది. అయితే,ఆమెకు అక్కడి ప్రభుత్వం సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఆర్ధికంగా ఆమెకు సహకరిస్తామని, అయితే, ఇకపై పిల్లలు కనకూడదు అని షరతు పెట్టింది. దానికి ఆమె ఆనందంగా అంగీకరించింది. ఇప్పుడు ఆమె పిల్లలు స్కూల్ కు వెళ్తున్నారు. ఆనందంగా చదువుకుంటున్నారు. ఈ సంఘటన ఆఫ్రికాలోని ఉగాండాలో జరిగింది. ఆ మహిళా పేరు మరియం.

Related posts