telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిన్నారిని దత్తత తీసుకున్న “సాహో” బ్యూటీ

Mandira

బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్‌, టెలివిజన్ ప్రజెంటర్ మందిరా బేడీ ఒకవైపు టీవీ హోస్ట్ గా చేస్తూనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చిన మందిరా.. సాదీ కా లడ్డూ, వోడ్కా డైరీస్‌, బదల్‌, ఓ తేరీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రభాస్ నటించిన ‘సాహో’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే బుల్లితెరపైన పలు సీరియల్స్‌లో, ఓటీటీలో పలు వెబ్‌ సిరీస్‌లో ఆమె నటించారు. ఇక మందిరా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మందిరా దంపతులు నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నారు. ఇప్పటికే మందిరా, రాజ్‌ కౌషల్‌ దంపతులకు వీర్‌ అనే కుమారుడు ఉండగా.. ఇప్పుడు తారా అనే చిన్నారిని వారు దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని మందిరా సోషల్ మీడియాలో పంచుకున్నారు. “దేవుడి ఆశీస్సులతో ఈ చిన్నారి మా జీవితాల్లోకి వచ్చింది. మా లిటిల్‌ గర్ల్‌ తార. నాలుగేళ్లు దాటిన ఈ చిన్నారి కళ్లు నక్షత్రాల వలే ప్రకాశిస్తుంటాయి. వీర్‌ తన చెల్లిలిని ఎంతో సంతోషంగా, ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించాడు. తారా బేడీ కౌశల్‌.. జూలై 28 నుంచి మా ఇంట్లో భాగం అయ్యింది” అని మందిరా ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ చిన్నారితో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. ఆమె పోస్ట్‌కు పలువురు అభినందనలు చెబుతున్నారు.

Related posts