telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ వివాదం… ఆదివాసీల స్పూఫ్ వీడియో

RRR

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టాడు జక్కన దాంతో ఒక్కొక్కరుగా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. అయితే వివాదాలకు దూరంగా ఉంటూ భారీ సినిమాలు రూపొందించే దర్శకధీరుడు రాజమౌళిని ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” వివాదం వెంటాడుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఎన్టీఆర్ టీజర్ విడుదల చేయడంతో అందులోని సన్నివేశాలపై ఓ వర్గం నుంచి వ్యతిరేకత మొదలైంది. దీంతో షూటింగ్ దశలోనే “ఆర్ఆర్ఆర్” సినిమాపై వివాదాలు చుట్టముట్టడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే కొమురం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మంగి గ్రామంలో ఉంటున్న ఆదివాసీ యువత “ఆర్ఆర్ఆర్” తరహాలో (స్పూప్) టీజర్ విడుదల చేసి తన నిరసన తెలియజేశారు. ఈ వీడియోలో కొమురం భీం పాత్రదారుడికి స్కల్ క్యాప్ కు బదులుగా పట్కా, భీంకు దండ, బొట్టుతో వీడియో రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇందులో కొమురం భీం ముస్లిం టోపీ కాకుండా తలకు కండువా చుట్టుకుంటాడని, ఆయన కండువా చుట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించారు. 

Related posts