కరోనా కారణంగా పురుషుల, మహిళల ఐపీఎల్ ను యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది బీసీసీఐ. అయితే నిన్నటితో పురుషుల ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఈ రోజు షార్జా వేదికగా మహిళలు టీ 20 ఛాలెంజ్ ప్రారంభమవుతుంది. అందులో భాగంగా ఈ రోజు మొదటి మ్యాచ్ లో సూపర్నోవాస్-వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. అయితే టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బౌలింగ్ ఎంచుకోవడంతో హర్మన్‌ప్రీత్ కౌర్ న్యాయకత్వం లోని సూపర్నోవాస్ మొదట బ్యాటింగ్ చేయనుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.
వెలాసిటీ : షఫాలి వర్మ, డేనియల్ వ్యాట్, మిథాలీ రాజ్(c), వేద కృష్ణమూర్తి, సుష్మ వర్మ(w), సునే లూస్, మనాలి దక్షిణా, శిఖా పాండే, ఏక్తా బిష్ట్, లీ కాస్పెరెక్, జహనారా ఆలం
సూపర్నోవాస్ : ప్రియా పునియా, చమరి అథపత్తు, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(c), శశికల సిరివర్ధనే, తానియా భాటియా(w), పూజ వస్త్రకర్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, షకేరా సెల్మాన్, అయబొంగా ఖాకా
కేసీఆర్ ఉద్యమ ద్రోహులతో మాట్లాడిస్తున్నారు: అశ్వాత్థామరెడ్డి