telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్దం చేస్తోన్న ఏపీ ప్రభుత్వం

corona vaccine covid-19

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్దం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ముందుగా ఆరోగ్య సిబ్బందికి కోవిడ్‌ టీకాలు వేయనున్న అధికారులు… కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునే 3,87,983 మందిని గుర్తించారు అధికారులు. ఈ మేరకు జిల్లాల వారీగా జాబితాను సిద్దం చేసింది వైద్యారోగ్య శాఖ. అత్యధికంగా తూ.గో జిల్లాలో.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో వ్యాక్సిన్‌ లబ్దిదారులు ఉన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్దిదారులకు కోవిన్‌ యాప్‌ ద్వారా ఎస్సెమ్మెస్సులు పంపనుంది ప్రభుత్వం. ఏమైనా అనుహ్య పరిణామాలు ఎదురైనా… ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది.

కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్దిదారుల జిల్లాల వారీ వివరాలు:

అనంత-29065, చిత్తూరు-33773, తూ.గో-38128, గుంటూరు-35389

కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్దిదారుల జిల్లాల వారీ వివరాలు:
కృష్ణా-34813, కర్నూలు-33279, ప్రకాశం-25383, నెల్లూరు-31346

కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్దిదారుల జిల్లాల వారీ వివరాలు:
శ్రీకాకుళం-21934, విశాఖ-36694, విజయనగరం-17465

కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్దిదారుల జిల్లాల వారీ వివరాలు:
ప.గో-27323, కడప-23391

Related posts