telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో 16 మంది ఐఏఎస్‌ల బదిలీ!

ap

ఏపీ ప్రభుత్వం 16 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు ఐఏఎస్ అధికారులకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ విభాగాలకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగులో ఉన్న కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు కూడా ఇచ్చింది.

బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె. ప్రవీణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించగా, రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు కేటాయించింది. క్రీడలు, యువజన సంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్‌ను నియమించింది. ఎస్టీ వెల్ఫేర్ గిరిజన సంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండేను నియమించగా, సర్వే, ల్యాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం.. ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులును నియమించింది. అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి, సివిల్‌ సప్లైస్ డైరెక్టర్‌గా దిల్లీరావు, శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి.అర్జున్‌రావు, సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్, కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌రెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా ఎం. మధుసూదన్‌ రెడ్డి, ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్‌రెడ్డిని నియమించింది.

Related posts