telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీహార్ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజయ సిన్హా…

బీజేపీ ఎమ్మెల్యే విజయ సిన్హా బీహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల బీహార్‌లో అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగియి. వీటిలో వాయిస్ ఓటింగ్ ద్వారా అభ్యర్థిని ఎంచుకున్నారు. బీజేపీ తరుపున విజయ సిన్హా  స్పీకర్ స్థానానికి పోటీచేయగా, రాష్ట్రీయ జనతా దళ్ ఆర్‌జేడీ తన అభ్యర్థిగా ఎమ్మల్యే బిహారీ చౌదరిని ప్రకటించింది. అయితే ఆర్‌జేడీ ఎమ్మేల్యే ఇటీవల బీహార్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితిని తయారుచేశారు. దీనికి కారణం స్పీకర్ పదవికి వాయిస్ ఓటింగ్‌ ద్వరా అభ్యర్థిని ఎన్నుకునే పద్దతిని తిరస్కరిస్తూ ఈ గందరగోళానికి దారి తీశాడు. అయితే వెంటనే తేజస్వీ లేచి స్పీకరు ఎన్నికప్పుడు నిబందనలు పాటించాలి. మేము నిబంధలను ఉల్లంఘించాము. ఇప్పుడు బయటకు వెళ్లిపోవాలా అన్నారు. అంతేకాకుండా ఆర్‌జేడీ ఎమ్మెల్యే రూల్ పుస్తకాన్ని ప్రొటీమ్ స్పీకర్ జితన్‌కు చూపారు. దాంతో జితన్ ‘ఇక్కడి స్పీకర్ ఎన్నకలకు ఓటు వాయని వారికి ఆ నిబంధనలు. వారు ఉన్నంత మాత్రాన సమస్యేమీ ఉంద’ని అన్నారు. ఎన్నికలు జరిగినప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్, విద్యా మంత్రి అశోక్ అక్కడే ఉన్నారు. అయితే చివరకు స్పీకరు ఎన్నకలో బీజేపీ ఎమ్మేల్యే విజయ సిన్హా గెలిచినా విషయం తెలిసిందే.

Related posts