telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి పోస్ట్‌కు తెలంగాణ పోలీస్ బాస్ కృతజ్ఞతలు

chiru

పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి కరోనాను కట్టడి చేసే పోరాటంలో పాలుపంచుకుంటున్న పోలీసులకు చిరంజీవి సెల్యూట్ చేసారు. ఒక పోలీసు బిడ్డగా పోలీసులు బాధ్యతలు ఎలా ఉంటాయో నాకు తెలుసన్నారు. దీనికి సంబందించి ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరంజీవి పోస్ట్‌కు తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మీ లాంటి వాళ్లు నాకు మాత్రమే కాదు.. మా పోలీస్ ఫోర్స్‌కు మీ మాటలు ఎంతో స్పూర్తి నిస్తున్నాయి. మీ లాంటి హీరోలు పిలుపువల్ల చాలా మంది కరోనా పై పోరాటంలో ప్రజలు కలిసి వస్తారని పేర్కొన్నారు. ఒక పోలీసు ఫ్యామిలీ మెంబర్‌గా మీకు పోలీసులు బాధ్యతలు ఎలా ఉంటాయో తెలిపినందుకు కృతజ్ఞతలు అన్నారు.

Related posts