telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కంగనాకు మద్దతుగా నిలిచినా కోర్టు…

Kangana

మహరాష్ట్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్ వరుస కేసులు నమోదైన విషయం తెలిసిందే. అందులో దేశద్రోహం కేసుకూడా ఉంది. అయితే ఈ కేసును పరిశీలించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరస్కరించింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశ ద్రేహం కేసు పెట్టి భయపెడతారా అని ప్రశ్నించింది. అయితే కొంత కాలంగా కంగనా మహరాష్ట్ర ప్రభుత్వంపై, బాలీవుడ్ సినీ పరిశ్రమపై తీవ్ర వాఖ్యలు చేస్తున్నారు. సుశాంత్ కేసులోని కోణాలు నెపొటిజం, డ్రగ్స్ కేసులపై కూడా ఈమె స్పందించారు. మహరాష్ట్ర సీఎం అతడి కుమారుదిపై కూడా ఈమె ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ముంబై పోలీసులు ఈమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో కంగనా లాయర్ కోర్టుకు వెళ్లారు. కంగనా ప్రభుత్వ పనితీరును విమర్శంచిందని, అంతేకాని ఎవరి వ్యక్తిగతంగా ఎటువంటి మాట అనలేదని, విమర్శించినందుకు గాను తన క్లయింట్ కంగనపై దేశద్రోహం కేసును పెట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కంగనా, ఆమె సోదరి రంగోలీపై ముంబైపోలీసులు పెట్టిన దేశద్రోహం కేసు బంబే హైకోర్టులో సాగింది. ఈ నేపథ్యంలో జస్టిస్ షిండే మాటలు దుమారం లేపాయి. ‘దేశ పౌరులను ఇలా చూస్తారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం వచ్చిన సెక్షన్‌లలో నచ్చిన కేసును నమోదు చేస్తారా. అంతేకాకుండా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు సెక్షన్ 124ఏ విధిస్తారా. అసలు ఈ సెక్షన్ ఎక్కడ, ఎప్పుడ వాడాలో కూడా పోలీసులకు తెయడంలేరదు. పోలీసులకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్‌లపై శిక్షణ ఇవ్వండ’ని షింగే తెలిపారు.

Related posts