telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యువతను రెచ్చగొడుతున్న శ్రీదేవి కూతురు !

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జాన్వీ నటించిన “గుంజన్‌సక్సేనా : ది కార్గిల్ గర్ల్” చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక ఇప్పటికే రూహీ అఫ్జానాతో పాటు దోస్తానా 2 లో జాన్వీ కపూర్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. అయితే…అటు సినిమాలు చేస్తూ… ఇటు అందాలు ఆరబోస్తూ యువత మనుసులు దోచుకుంటుంది. అయితే… తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన బికినీ లుక్ లో గ్లామర్ పీక్స్ లో ఉండగా… ఆ పిక్ కుర్రకారులో హీట్ పుట్టిస్తోంది. ఈ పిక్ లో జాన్వీ గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న బికినీని ధరించింది. దానికి మ్యాచింగ్ గా మెడలో స్కై బ్లూ పూసల దండను ధరించింది. ఈ పిక్ కు ‘ఐలాండ్ గర్ల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ బ్యూటీ. జాన్వీ ఈ పిక్ ను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లో 854,231 లైకుల వర్షం కురిసింది. గ్లామర్ లుక్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న జాన్వీ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. 

Related posts