telugu navyamedia
సినిమా వార్తలు

మెగా అభిమానుల‌కు గుడ్‌న్యూస్ ..’ఆచార్య’ ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’ . దేవాలయాల వెనుక జరుగుతున్న అవినీతిని ఈ చిత్రం వెలికితీసే విధంగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Buzz: Acharya's trailer to be out on this date | 123telugu.com

ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ‘సిద్ధ’ పాత్రలో న‌టిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే సంద‌డి చేయ‌నున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్‌, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది.

ఏప్రిల్ 29న ఆచార్య చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ విషయంలో స్పీడ్‌ పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఆచార్య’ మూవీ ట్రైలర్‌ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్.

Megastar Acharya

ఏప్రిల్ 12న ఆచార్య ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. దీనికోసం చిరంజీవి ఎర్ర కండువాతో, రాంచరణ్ తుపాకీతో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ మూవీని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి రామ్ చరణ్ సైతం నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. చాలా కాలం తర్వాత మణిశర్మ చిరంజీవి చిత్రానికి సంగీతం అందించారు.

Acharya teaser: Chiranjeevi, Ram Charan, Pooja Hegde, Kajal Aggarwal  starrer's long-awaited glimpse to release on THIS date [EXCLUSIVE]

Related posts