అక్కడ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఏకంగా ఆ దేశ ప్రధానికే జరిమానా విధించారు పోలీసులు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్‌కు పుట్టిన రోజు వేడుకలు.. ఆమె భారీ జరిమానా చెల్లించేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్, కొన్ని దేశాల్లో అయితే, థర్డ్ వేవ్ కూడా నడుస్తోంది.. దీంతో.. ఆ మహమ్మారికి చెక్ పెట్టేందు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి ఆయా దేశాలు.. ఇక నార్వే సర్కార్ కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. బహిరంగ సభలు, పార్టీలపై నిషేధం విధించింది. ఏదైనా కార్యక్రమానికి 10 కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదని స్పష్టం చేసింది.. అయితే, అందరికీ ఆదర్శంగా నిలవాల్సినే ప్రధాన మంత్రియే.. రూల్స్‌ను బ్రేక్ చేశారు. తన 60వ బర్త్‌డే వేడుకులను జరుపుకున్నారు.. ఆ కార్యక్రమానికి 13 మంది హాజరయ్యారు.. వాళ్లంతా ఆమె కుటుంబ సభ్యులే.. తన కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని ఎర్నా సోల్బర్గ్… ఫిబ్రవరిలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొనగా.. కరోనా టైంలో ఈ వేడుకలు ఏంటి? అంటూ ప్రతిపక్షాలు, ప్రజలు, నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి.. చివరకు ఆమె దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే కాదు.. ఈ ఘటనపై ఫోకస్ పెట్టిన నార్వే పోలీసులు.. బర్త్‌డే పార్టీపై దర్యాప్తు చేశారు.. చివరకు ఆమెకు భారీగా జరిమానా విధించారు.. ప్రధానికి విధించిన జరిమానా ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 1.75లక్షలు అన్నమాట.
previous post
next post