telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పొత్తు ఉందా… లేదా..?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్న పార్టీలన్నీ తమ పార్టీ అభ్యర్థులను బరిలో దించేందుకు సిద్దమయ్యాయి. ఈ మేరకు పార్టీ అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, ప్రచార కార్యక్రమాలను ప్రకటించే పనిలో పడ్డాయి. ఈ క్రమములో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో బీజేపికి పొత్తు ఉంటుందా అనే ప్రశ్నకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే  బీజేపీతో జనసేన పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అని, అది తెలంగాణకు వర్తించదు అని బండి సంజయ్ స్పష్టంచేశారు. జనసేన పార్టీ కూడా ఒంటరిగానే వెళ్తుందని ఆ పార్టీ లేఖలో తెలియపరిచింది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు పవన్ తో సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి వీరి పోతు ఏపీ వరకే పరిమితమవుతుందా… లేదా తెలంగాణలో కూడా కొనసాగుతుందా అనేది.

Related posts