telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్’ హిందీలో డ‌బ్బింగ్ అదరగొడుతున్న ఎన్టీఆర్

ntr

రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా సీతారామరాజు గా చరణ్ ఎంట్రీ అదిరింది. దీనికి తోడు ఎన్టీఆర్ తెలంగాణా యాసలో వాయిస్ ఓవర్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇప్పుడు మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉండనున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. తాజాగా అందుతోన్న నివేదిక‌లు ప్ర‌కారం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హిందీలో తానే ఓన్ గా డ‌బ్బింగ్ చెప్పుకోబోతున్నాడ‌ట‌. ఇటీవ‌లే అందుకు సంబంధించిన డెమో కూడా పూర్త‌య్యింద‌ట‌. సీన్ పేప‌ర్ ను రెండు సార్లు చ‌దివిన తార‌క్ సింగిల్ టేక్ లో డ‌బ్బింగ్ కంప్లీట్ చేశాడ‌ట‌. దీంతో జ‌క్క‌న్న‌తో పాటు హిందీ టెక్నిషియ‌న్లు ఒక్కసారిగా కంగుతిన్నార‌ట‌. అందుకే సినిమా ఫుల్ వెర్ష‌న్ డబ్బింగ్ కి రెడీ అయిపోమ‌ని రాజ‌మౌళి ఎన్టీఆర్ కు చెప్పిన‌ట్లు స‌మాచారం. గతంలో జంజీర్ సినిమా కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ పై ఆధార‌ప‌డ్డాడు చ‌ర‌ణ్. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అత‌డు కూడా హిందీలో ఓన్ డ‌బ్బింగ్ కు సై అనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Related posts