telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పెరిగిన వరద… సాగర్ 10 గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది.. రెండు తెలుగు రాష్ట్రలో అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. అయితే ఇప్పటికే శ్రీశైలం గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో.. దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు సాగర్ రెండు గేట్లను ఎత్తివేశారు అధికారులు. కానీ ఈ రోజు ఇన్‌ఫ్లో అధికంగా పెరగడంతో ఇవాళ నాగార్జునసాగర్‌ 10 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో రూపంలో 1,90,281 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా… 10 గేట్ల ద్వారా అంతే అంటే 1,90,281 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. ఇక, నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలు ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుతం నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది.

Related posts