నిర్మాత దిల్ రాజు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ దశమి సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి సీనయ్య అనే టైటిల్ ఖరారు చేశారు. వినాయక్ మాస్ లుక్‌తో దర్శనమిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్.నరసింహ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. గతంలో ఈయన శరభ అనే సినిమాను తెరకెక్కించారు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా 2018లో వచ్చిన ఇంటెలిజెంట్ సినిమాకు వినాయక్ చివరగా దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపింది. బుధవారం వినాయక్ 45వ పుట్టినరోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే.
నా గురించి దేవేగౌడ అసత్యాలు మాట్లాడారు: సిద్ధరామయ్య ఫైర్