telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కర్తవ్యం-2’ వస్తే అది నయనతారతోనే… : దర్శకుడు గోపీ నైనార్

Nayan

2017లో నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘కర్తవ్యం’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను మెప్పించింది. గోపీ నైనార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం టైటిల్ తమిళంలో ‘ఆరమ్’. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించే కలెక్టర్ పాత్రలో నయన్ నటించిన ఈ చిత్రాన్ని ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. 2017లో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ప్రశంసలు అందుకుంది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్టు, అందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా దర్శకుడు గోపీ స్పందించారు. “ఇలాంటి వార్తలను ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదు. `కర్తవ్యం-2`కు నయన్ డేట్స్ ఇవ్వలేదన్న దానిలో నిజం లేదు. అలాంటి వార్తలను ఎవరూ నమ్మకండి. ‘కర్తవ్యం-2’ వస్తే అది నయనతారతోనే” అని గోపీ స్పష్టం చేశారు.

Related posts