telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీరియల్ షూటింగులకు మళ్ళీ బ్రేక్ ?

Shooting

హైదరాబాద్ లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీరియల్ నటుడు ప్రభాకర్ కరోనా బారిన పడ్డారు. దాంతో ఆ సీరియల్ లో నటిస్తున్న నటీనటులందరికీ కరోనా టెస్టులు చేసారు. వారి రిపోర్టులు రావడానికి మరో రెండురోజుల సమయం పడుతుంది. సీరియల్ నటుడికి కరోనా రావటంతో అన్ని సీరియల్స్ షూటింగ్లను నిలిపివేశారు. షూటింగ్లను కొనసాగించాలా లేదా అన్నదానిపై నటీనటులు, నిర్మాతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇక వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో ప్రభుత్వం సినిమా, సీరియల్ షూటింగ్ లకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. షూటింగ్ లకు అనుమతిస్తూనే ప్రభుత్వం కొన్ని నిబంధనలను కూడా పాటించాలని సూచించింది. షూటింగ్ జరిగే ప్రాంతంలో శానిటైజేషన్ తో పాటూ సామజికదూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. 60 సంవత్సరాల పై బడిన వారు చిన్న పిల్లలు షూటింగ్ లో పాల్గొనకూడదంటూ సూచించింది. కానీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కొందరు షూటింగ్ చేస్తునట్టు తెలుస్తుంది.

Related posts