telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడు నటుడు సోనూసూద్‌కు అరుదైన గౌరవం..

Sonusood

సోనూ సూద్ కరోనా కాలంలో ఎందరో వలస కూలీలకు తనవంతు సహాయం చేశాడు. వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి మరీ వారికి ఇళ్ళకు చేర్చాడు. అంతేకాకుండా ఇతర దేశాలలో ఉన్నా వారికోసం ప్రత్యే ఫ్లైట్లను కూడా పెట్టించాడు. దాంతో దేశంలో రియల్ హీరోగా పేరు పొందాడు. అంతేకాకుండా కరోనా కారణంగా నిరుద్యోగులైన వారికి ఎందరికో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాడు. అయితే ఇటీవల సోనూ సూద్ తన పేరు మీద మరో రికార్డును రాశాడు. ఓ ప్రముఖ యూకే సంస్థ చేసిన సర్వేలో ఈ రియల్ హీరో పేరు కూడా ఉంది. ఆసియాలోని ప్రముఖ తారల సరసన సోనే నిలుచున్నాడు. అయితే.. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్‌కు అవార్డులు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ రియల్‌ హీరోకు పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2020 అవార్డును యూఎన్‌డీపీ ప్రకటించింది. కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో సోనూ సేవలకు గానూ ఈ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డుతో సత్కరించింది. కరోనా వేళ సోనూ తన ఫ్రెండ్‌ నీతి గోయెల్‌తో కలిసి ఘర్‌ బేజో క్యాంపెయిన్‌ ద్వారా 7.5 లక్షలకుపైగా వలస కార్మికులకు స్వంత ఇళ్లకు చేర్చాడు.

 

Related posts