telugu navyamedia
సినిమా వార్తలు

కొత్త కారు… కొత్త ఇల్లు… యాంకర్ హరితేజ కొత్త లైఫ్

Hariteja

బుల్లితెర నటిగా కెరీర్ మొదలుపెట్టిన హరితేజ ఆ తరువాత యాంకర్‌గా, వెండితెర నటిగానూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డ హరితేజ…ఆఫర్లు వచ్చిన తరువాత మాత్రం వెనుతిరిగి చూసుకోలేదు. అ..ఆ సినిమాలో మంగమ్మగా ఫన్నీ క్యారెక్టర్‌లో కనిపించిన హరితేజ, ఆ తరువాత బిగ్ బాస్ రియాల్టీ షోలో తళుక్కుమంది. తృటిలో హరితేజ బిగ్ బాస్ టైటిల్‌ను మిస్ చేసుకున్నప్పటికీ, ఆ షో ద్వారా కావాల్సినంత గుర్తింపును సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న హరితేజ తాజాగా తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. అదిరిపోయే లొకేషన్‌లో సౌకర్యవంతమైన ఇంటిని తన సొంతం చేసుకుంది. భర్తతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇంత కాలానికి తాను కన్న కలని నిజం చేసుకున్నానని తన భర్తతో కలిసి కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తున్న ఫొటోని ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత మంది సపోర్ట్ గా నిలిచారో.. ఎంత మంది తమ సహాయ సహకారాల్ని అందించారో అందరికీ థ్యాంక్స్ చెప్పింది. తన ఎదుగుదలకు కారణమైన వారితో తన ఆనందాన్ని పంచుకోవడానికే ఈ ఫొటోని షేర్ చేస్తున్నానని తెలిపింది హరితేజ. ఇటీవల వోల్వో ఎస్‌యూవీ కారును కొనుగోలు చేసిన హరితేజ… ఆ కారు ముందు ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Related posts