telugu navyamedia
సినిమా వార్తలు

మహిళా మణులు…

virikanne bhama poetry corner

కళ్ళలో కన్నీటి చుక్కలు నిలుపుకున్నకలువలం ……
మల్లెలమ్ విరిసే చిరునవ్వుల మగువలం…
గులాబీల ముఖారవింద ముదితలం….
సంగీత స్వరా లొలికించే కళామ తల్లులం….
నర్తించే నాట్య  మయూరులం……
యుద్ధ రంగానికి ధీరులను సాగనంపే…..
ధీర వనితలం …..
ఆకాశాని కెగసే అనంత సాధకులం…..
అన్నీ భరించే  భాధితులం……
ప్రశాంత సాగర తీరంలా సేద తీర్చే……
శాంత మూర్తులం…..
ఆపన్న సమయాన……..
రుధిరనేత్ర రుద్రమదేవిలం……
పట్టుదలను చేత ధరించిన ……
శిఖరాన్ని అధిరోహించగల మహిళా మణులం!
నిరవత కార్య  నిర్వాహక …..
నిర్ విజ్ఞులం…..
అన్నీ ఓర్చే సహన శీలులం…..
సుందర సుకుమార కోమలులం…..
అవసరమైతే ఆది పరాశక్తులం !
ప్రేమించే కల్పవల్లులం…..
పాలిచ్చి పాలించే తల్లులం ……
క్షమించే మనసున్న కరుణామూర్తులమ్
అన్నీ కలగలసిన అనురాగ గీతికలం.!

Related posts