విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటన కేసుకు సంబంధించి టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని వరుస ట్వీట్స్ చేసి హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. రామ్ ట్వీట్ గురించి విజయవాడ సీపీ శ్రీనివాస్ పరోక్షంగా ప్రస్తావిస్తూ “పోలీసుకు కులం, మతం లేదు. మాకు అందరూ సమానమే. మరీ ముఖ్యంగా పోలీసులకు రాజకీయ పార్టీలు, మతాలు అనేవి ఉండవు. ఎవరో ఏదో కామెంట్ చేశారని నేను స్పందించను. విచారణ ఎలా చేయాలో మాకు తెలుసు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికేవారు. ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు లేకుండా ఆస్పత్రి నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించాం. మాకు సందేహం ఉన్న అందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తాం. స్వర్ణ ప్యాలెస్‌లో క్వారంటైన్ సెంటర్ కాకుండా కోవిడ్ కేర్ సెంటర్ పేరుతో నిర్వహించారు. రమేష్ ఆసుపత్రిలో బోర్డు నిర్ణయాలు కూడా చేస్తుంది. ఆ కాపీలు వస్తే ఆయా వ్యక్తులను కూడా పూర్తిగా విచారిస్తాం. స్వర్ణ ప్యాలెస్ ఘటన కేసు విచారణకు ముద్దాయిలు, అనుమానితులు సహకరించడం లేదు. స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యాల మధ్య ఏం ఒప్పందం జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారు. ట్రీట్మెంట్‌కు అధికంగా డబ్బులు వసూలు చేశారని తేలింది. 91 నోటీసులు కూడా ఆస్పత్రి బోర్డు సభ్యులకు ఇచ్చాం. ముఖ్యంగా టాప్ మేనేజ్మెంట్ కోసం వెతుకుతున్నాం. ఈ ఘటనలో అన్యాయంగా పది మంది మృతి చెందారు. అందులో ఎనిమిది మందికి నెగిటివ్ కూడా వచ్చింది. దర్యాప్తుకు సహకరిస్తే వారికే మంచిది. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే లక్ష రూపాయలు బహుమతి ఇస్తాం’ అని సీపీ శ్రీనివాసులు ప్రకటించారు.
previous post
ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టీడీపీ: విజయసాయిరెడ్డి