telugu navyamedia
సినిమా వార్తలు

జూబ్లీహీల్స్ నివాసంలో కృష్టం రాజు భౌతిక‌కాయం..సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులు

*జూబ్లీహీల్స్ నివాసానికి కృష్టం రాజు భౌతిక‌కాయం
*అధికార లాంఛనాల‌తో రేపు మ‌ధ్య‌హ్నం అంత్య‌క్రియ‌లు
* కృష్టం రాజు నివాసానికి చేరుకున్న‌ ప్ర‌ముఖులు..

* కృష్ణం రాజు బౌతిక‌కాయానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులు

ప్రముఖ నటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్​లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

ఏఐజీ ఆస్పత్రి నుంచి కృష్ణంరాజు భౌతికకాయాన్ని.. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారుఅక్క‌డ కుటుంబ స‌భ్యుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. కృష్ణం రాజు బౌతిక‌కాయాన్ని చూసి ఆయ‌న స‌తీమ‌ణి శ్యామలాదేవి క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు.

సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరపాలని సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు… సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం ఫిల్మ్‌ ఛాంబర్‌కు కృష్ణంరాజు భౌతికకాయం తరలించనున్నారు.

 

Related posts