మా అన్నయ్య.. మొగల్తూరి బిడ్డ. కృష్ణంరాజు లేరనే మాట. జీర్ణించుకోలేకపోతున్నా అని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు..
జూబ్లీహిల్స్ నివాసంలో కృష్ణంరాజు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇటీవల ఆయన ఆరోగ్యం గురించి నేనూ ఆరా తీశా..ఇలా జరగడం చాలా విచారకరం.ఆయన గతంలో చాలా సార్లు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ప్రతిసారి ఆరోగ్యంగా తిరిగి వచ్చేవారు. ఈసారి కూడా అలాగే ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నా.ఇలా అవుతుందని ఊహించలేదని అన్నారు.
చిలకా గోరింక’ చేసినప్పుడు మొగల్తూరు వస్తే, ఆయన్ను చూడటానికి ఎగబడిన వాళ్లలో నేనూఉన్నాను ఇంకా ఆదృశ్యం నా కళ్ళలో కదలాడుతూ ఉంది. ఆయన బయటకు వచ్చి, చేయి ఊపితే ‘హీరో అంటే ఇలా ఉండాలి’ అనిపించింది. ఆయన మాట్లాడినా,నిలబడినా రాజసం ఉట్టిపడేది..
రావుగోపాల్ రావు లాంటి వాళ్లు ఆయన్ను పేరుతో పిలిచేవారు కాదు.. రాజావారు రాజావారు అని పిలిచేవారు.
కృష్ణం రాజు మహా వృక్షం లాంటివారు ఈ రోజు ఆ మహా వృక్షం నేలకొరిగింది. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన ఆత్మకు చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.
కాగా అంతకుముందు ట్వీట్టర్ వేదికగా ..శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారి తో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’ కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రి గా కూడా ఎన్నో సేవలందించారు.
ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కీ, నా సంతాపం తెలియచేసుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.
సుడిగాలి సుధీర్ బేవకూఫ్… : నాగబాబు