telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్, శ్రీముఖిలపై హిమజ సంచలన వ్యాఖ్యలు

Himaja

బిగ్ బాస్ పై హిమజ సంచలన ఆరోపణలు చేసింది. 9వ వారం బిగ్ బాస్ ఇంటినుంచి బయటకు వచ్చిన హిమజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హిమజ బిగ్ బాస్ సీజన్ 3లో తన అనుభవాలను పంచుకుంది. ఇందులో ప్రధానంగా శ్రీముఖికి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు చేసింది. అంతేకాదు “బిగ్‌బాస్‌కు బాసువు నువ్వమ్మా” అంటూ ప్రత్యేకమైన జింగిల్ సైతం చేయించుకొని శ్రీముఖి రెచ్చిపోయిందని, ఇలా చేస్తే ఆడియన్స్ లోకి తప్పుడు మెసేజ్ వెళ్తుందని అంతా అనుకున్నామని, అయితే షో నిర్వాహకులు మాత్రం శ్రీముఖి వైపే మొగ్గు చూపుతున్నట్లు పలు సందర్భాల్లో బయటపడిందని హిమజ ఆరోపించింది. అంతేకాదు స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో కూడా అందరికన్నా ఎక్కువగా శ్రీముఖి ఉన్న సీన్లే టెలికాస్ట్ అయ్యాయని హిమజ పేర్కొంది. బిగ్‌బాస్ కాస్త ఎక్కువగానే శ్రీముఖిపై దృష్టి పెడుతున్నాడని, అంతేకాదు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిలో కూడా ఇదే అభిప్రాయం ఉందని హిమజ ఆరోపించింది. ఇప్పటికే జనాల్లోకి శ్రీముఖియే విన్నర్ అనే ఫీలింగ్ వెళ్లిపోయిందని, అంతే కాదు టాస్క్ లు చేస్తున్నప్పుడు శ్రీముఖి కెమెరా దగ్గరకు వెళ్లి బిగ్ బాస్ కు సజెషన్స్ సైతం ఇస్తోందని హిమజ వాపోయింది.

Related posts