telugu navyamedia
సినిమా వార్తలు

“లైగర్” నుంచి డ‌బుల్ ధ‌మాకా సర్ప్రైజ్..

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘లైగర్. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులుకు డ‌బుల్‌ సర్ప్రైజ్ ఇచ్చారు చిత్రబృందం.. ఇటీవ‌ల ఈ మూవీ నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా ‘లైగర్’​మూవీ రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు 31 చిత్రానికి సంబంధించిన ఓ గ్లింప్స్​ను రిలీజ్​ చేయబోతున్నట్లు తెలిపింది.

Ananya Panday and Vijay Deverakonda's Liger release postponed; will release  in 2022 : Bollywood News - Bollywood Hungama

మొట్ట మొదటిసారిగా ఇండియన్ సినిమాలో ప్రపంచ దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో  సినిమాపై మ‌రింత అంచనాల‌ను తీసుకొచ్చారు. 

పా​న్‌ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ‘లైగర్​’ మూవీని నిర్మిస్తున్నాయి.  ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఛార్మి ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

Related posts