వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాని కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటే కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్ ఆగింది. వెంకటేష్ అభిమానులు ‘నారప్ప’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా నారప్ప టీం సినిమా కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో విక్టరీ వెంకటేష్ తన కుంటుంబ సభ్యులతో విహారయాత్రను ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు తమ సినిమా వేసవి కానుకగా అభిమానులను అలరించనుందని తెలిపారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
previous post
next post