ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె జాన్వి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదిత్యతో ఆమె ఏడడుగులు వేశారు.
ఈ పెళ్లి వేడుకల్లో పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు సందడి చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, హరీశ్ రావు, మెగా హీరో చిరంజీవి, పవన్‌కల్యాణ్, నాగార్జున, దర్శకులు హరీశ్ శంకర్, బోయపాటి శ్రీను, ప్రశాంత్ వర్మ, అనుదీప్, శేఖర్ కమ్ముల తదితరులు హాజరై వధూవరులను దీవించారు.
కాగా..ఈ వేడుకల్లో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.