telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న అక్కినేని కోడలు

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి అభిమానుల‌ను అల‌రించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆహా కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారింది. అయితే… పెళ్లైన తర్వాత గ్లామర్‌ యాంగిల్‌లో సమంత కనిపించదేమో అని చాలా మంది యువత ఫీల్‌ అయ్యారు. కానీ అక్కినేని కోడలయ్యాకే ఇంకా ఎక్కువ అందాలను ఆరబోస్తోంది సమంత. రీసెంట్‌గా తను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు మాత్రం యువత అలా మంత్ర ముగ్దులై చూస్తూ ఉండిపోతున్నారు. ఆ కై పెక్కించే కళ్లతో, బోల్డ్‌ స్టిల్స్‌తో యువత వెర్రెక్కిపోయేలా చేస్తుందని అనడంలో ఎలాంటి డౌట్‌ లేదు. కాగా.. ఇటీవలే సామ్‌ తన భర్త చైతూతో కలిసి మాల్దీవులు హాలీడేస్‌ ట్రిప్‌ ఎంజయ్‌ చేసింది. అలా ట్రిప్‌ నుంచి తిరిగి రాగానే క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు. ఇంకా న్యూ ఇయర్‌ వేడుకలు కూడా ఎలా చేసిందో అందరికీ తెలిసిందే…

Related posts