కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే మార్పుకు అలవాటుపడుతున్నారు ప్రజలు. ఇక ఈ సమయంలో సెలెబ్రిటీలంతా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు లేదంటే వారి పాత మెమోరీస్‌కి సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ టీనేజ్ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. షారూఖ్ ఖాన్ 1988లో వచ్చిన ఫౌజీ అనే చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన షారూఖ్.. న్యూ ఢిల్లీలోని సెయింట్ కొలుంబస్ స్కూల్‌లో చదివారు. అప్పుడు తన క్లాస్‌మేట్స్‌తో కలిసి ఫోటో దిగాడు. బూడిద రంగు సూట్‌లో ఉన్న షారూఖ్ లుక్ ఫ్యాన్స్‌కి థ్రిల్‌ని కలిగిస్తుంది. కాగా చివరిగా “జీరో” సినిమాలో నటించిన ఆయన తదుపరి సినిమా కోసం కథలు వింటున్నారు.
previous post