telugu navyamedia
సినిమా వార్తలు

అంచనాలు అర్థమవుతున్నాయి : ప్రభాస్

saaho movie team surprice on sradda birthday
“బాహుబ‌లి” సినిమాతో దేశవ్యాప్తంగా మార్కెట్ సంపాదించాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ఇక‌పై ప్ర‌భాస్ సినిమాలు తెలుగుతోపాటు ప‌లు ఇత‌ర భార‌తీయ భాష‌ల్లో సైతం విడుద‌ల కాబోతున్నాయి. ఇప్ప‌టికే పూర్తి చేసిన “సాహో”తోపాటు ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ రాధాకృష్ణ రూపొందిస్తున్న సినిమా కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుద‌ల కాబోతోంది. తాజాగా త‌న కెరీర్ గురించి ప్ర‌భాస్ ఓ ఆంగ్ల పత్రిక‌తో మాట్లాడాడు. “బాహుబ‌లి” సినిమాకు దేశ‌వ్యాప్తంగా విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భించ‌డం నా అదృష్టం. ప్రేక్ష‌కులు నన్ను చాలా ప్రేమిస్తున్నారు. నా నుంచి చాలా ఆశిస్తున్నారు. వారి అంచ‌నాలు నాకు అర్థ‌మ‌వుతున్నాయి. నా నుంచి `ది బెస్ట్` ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నా. వారిని దృష్టిలో పెట్టుకునే క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నా. వారు న‌న్ను ఎలాంటి పాత్ర‌ల్లో చూడాల‌నుకుంటున్నారో ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటాను” అని ప్ర‌భాస్ చెప్పాడు.

Related posts