telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ చరణ్ కొత్త సినిమా పూజ కార్యక్రమంలో సినీ ప్రముఖుల సందడి.. RC 16 రామ్ చరణ్, జాన్వీ న్యూలుక్స్ .

రామ్ చరణ్ కొత్త సినిమా RC 16 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా, రామ్ చరణ్ కథానాయకుడు గా నటించబోతున్నారు.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అలాగే ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు.

ఈ సినిమా పూజా కార్యక్రమం వేడుక ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ శంకర్, డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, బోనీ కపూర్ తోపాటు.

సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆర్సీ 16 పూజా కార్యక్రమానికి వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు.

ప్రేక్షకులు ఈ సినిమా చూసి తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో చరణ్, జాన్వీ పక్కపక్కనే ఉన్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

గతంలో మెగాస్టార్ చిరంజీవి, నటి శ్రీదేవి కలిసి నటించిన “జగదేకవీరుడు అతిలోక సుందరి”

తర్వాత మళ్లీ ఇప్పుడు చిరు తనయుడు.. శ్రీదేవి తనయ కలిసి సినిమా చేస్తుండడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts