telugu navyamedia
సినిమా వార్తలు

వీడియో వైరల్ : జాన్వీ కపూర్ బెల్లీ డాన్స్

Jahnavi-Kapoor

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్” తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తొలి లేడీ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథతో రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోంది. అలానే ‘తక్త్’ అనే మరో చారిత్రాత్మక చిత్రంలో నటిస్తోంది. తెరపై అందంగా కనిపించడంకోసం జాన్వీ జిమ్ లో చాలాసేపు కష్టపడుతూ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు పలు రకాల నృత్యాల్లోనూ శిక్షణ పొందుతోంది. తాజాగా జాన్వీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో బయటకి వచ్చింది. జాన్వీ బెల్లీ డాన్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు లైక్ లు, కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.

 

View this post on Instagram

 

#janhvikapoor belly dancing moves 🔥🔥🔥🔥

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Related posts