telugu navyamedia
సినిమా వార్తలు

దుమ్మురేపుతున్న వినాయక చవితి స్పెషల్‌ సాంగ్స్‌

వినాయక చవితి సందర్భంగా పలు సంస్థలు, గాయకులు కొత్త పాటలు విడుదల చేశారు. తాజాగా ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత లక్ష్మణ్‌ రాసిన పాటకు ప్రముఖ గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్‌ విడుదలైంది. మధుప్రియ కూడా ఓ పాట రూపొందించి విడుదల చేసింది.

ఇక తాజాగా ‘బిగ్‌ బాస్‌ 3’ విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌‌ గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా ఓ పాటతో వచ్చాడు. వేంగి సుధాకర్‌ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్‌ కా గణేశ్‌’ పాటకు రాహుల్‌ దుమ్ములేపేలాపాడాడు.

ఈ పాటలో రాహుల్‌కు బిగ్‌బాస్‌లో ఫ్రెండ్స్‌ అయిన అలీ రెజా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి ధూమ్‌ధామ్‌గా డ్యాన్స్‌ చేశారు. శిరీశ్‌ కుమార్‌ కొరియోగ్రఫీ చేశారు. ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్‌ వేసినట్లు తెలుస్తోంది.

 

Related posts