telugu navyamedia
సినిమా వార్తలు

‘అప్సర రాణి’తో పబ్‌లో చిందులేసిన ఆర్జీవీ ..

ఒకప్పుడు ఆయన సినిమాలు అంటే అందులో ఏదో ఒక కొత్త అంశం ఉండేది. ప్రతి సినిమాలో ఏదో ఒక ట్రెండ్ సెట్టింగ్ అంశం ఉండేది. అలాంటి దర్శకుడు కొంతకాలంగా కాంట్రవర్సీనే తన ప్రధాన అజెండాగా మార్చుకున్నారు. ప్రతీ విషయంలో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ట్రెండింగ్‌లో ఉండటం.. ఆర్జీవీకి వెన్నతో పెట్టిన విద్య.

RGV's Case: Quarantine Is different From Covid-Positive

ఆర్జీవి మాట్లాడినా సంచలనమే… మాట్లడక పోయినా సంచలనమే. నిత్యం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. వర్మ తాను తీసే సినిమాలతో కంటే.. తన నోటికి పని చెప్పి.. వివాదాస్పద కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు.

Ram Gopal Varma Makes Sensuous Comment On Actress Apsara Rani; Netizens Troll Him - Filmibeat

అయితే వర్మని ద్వేషించేవారు తిట్టుకునే వారు ఎంతమంది ఉన్నారో.. అతనిని అభిమానించేవారు కూడా అంతే మంది ఉన్నారు. అయితే ఇప్పుడు వర్మ నోటి పని చెప్పడం మానేసి.. కొంతమంది గర్ల్స్ తో ఎంజాయ్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హల్ చల్ చేస్తున్నాడు.

Ram Gopal Varma announces Thriller, a web film starring Apsara Rani

 

గతంలో బిగ్ బాస్ బ్యూటీ అరియన తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి రచ్చ చేసిన ఆర్జీవీ ఇటీవల బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో అప్సరాతో కలిసి వర్మ ‘థ్రిల్లర్’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాను తన ప్రత్యేక ఓటీటీలో విడుదల చేసిన వర్మకు మంచి లాభమే లభించింది. ఆ తర్వాత నైనా గంగూలీ, అప్సరాతో కలిసి ఆయన ‘డేంజరస్’ అంటూ ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే ప్రేమను హైలైట్ చేస్తూ ఓ సినిమాను రూపొందించారు వర్మ. ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా అప్సరా తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న వీడియో ఒకటి పోస్ట్ చేసిన వర్మ.. ‘‘ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. కానీ, కనీసం ఒక రాత్రికి అయినా.. నాకు అప్సరా రాణి పెంపుడు కుక్కలా అవ్వాలని ఉంది’’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

అలాగే అన్నంత ప‌నిచేశాడు.. అప్సరా రాణి తో వర్మ డీజే సాంగ్ కు తన్మయత్వంలో మునిగిపోతూ ఎంజాయ్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ లోని బ్రాడ్‌వే బ్రూవరీ పబ్ లో అప్సరా రాణి తో రామ్ గోపాల్ వర్మ స్టెప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ని ఆర్జీవీ.. మీ అందరికీ చాలా సంతోషకరమైన , పవిత్రమైన రోజు కావాలని కోరుకుంటున్నాను అంతేకాదు మీ అందరికీ టన్నుల కొద్దీ ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని ఆశిస్తున్నాను .. అంటూ కామెంట్ జత చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Related posts