బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైల్లో ఉన్నారు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా ? హత్యా ? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ లో ”ఇది హత్య అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నా దివంగత స్నేహితుడు సుశాంత్ కు న్యాయం జరగాలని ఎప్పుడూ కోరుకున్నాను.” అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె ఓ ట్విట్టర్ లో భారీ పోస్ట్ పెట్టింది. “కొంతమంది వ్యక్తులు నన్ను శత్రువుగా చూస్తూ నాపై విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. 2016 వరకూ సుశాంత్ మానసిక ఆరోగ్యం ఎలా ఉందో చెప్పాలనే నేను ప్రయత్నించాను. ఇక నన్ను విమర్శించే వారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నాను. సుశాంత్ మానసిక పరిస్థితి బాలేనప్పుడు మీ స్నేహితురాలు (రియాను ఉద్దేశిస్తూ..) సుశాంత్ నిరాశలో ఉన్నాడని బహిరంగంగా చెప్పడం ద్వారా అతని మానసిక స్థితి గురించి ఆమెకు బాగా తెలుసు అని అర్థం అవుతోంది. డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి డ్రగ్స్ తీసుకోవడానికి ఆమె అనుమతించాలా? అది ఎలా సహాయపడుతుంది? ఒకరిని ఇంతగా ప్రేమిస్తున్నానని చెప్పుకునే ఎవరైనా తన మానసిక స్థితి పరిస్థితిని తెలిసి డ్రగ్స్ తీసుకోడానికి ఆ వ్యక్తిని అనుమతిస్తారా? అని ప్రశ్నించింది. సుశాంత్ ఆరోగ్యం, వైద్య చికిత్సల గురించి అతని కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు చెప్పానని ఆమె అంటోంది. అయితే అతను మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నాడని కూడా తెలియ చేసిందా? నాకు తెలిసినంతవరకూ ఆమె ఆ విషయాన్ని చెప్పి ఉండదు. ఎందుకంటే ఆమె కూడా డ్రగ్స్‌ను ఉపయోగిస్తుంది కాబట్టి. అందుకే ఇది ఆమె కర్మ.. విధి అని నేను భావిస్తున్నాను” అని అంకితా లోఖండే చెప్పుకొచ్చింది.
next post