telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గాలి సంపత్ ట్రైలర్‌ అప్డేట్…

తెలుగులో హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. శ్రీవిష్ణు తాజాగా నటించిన సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను  అనిష్ దర్శకత్వంలో ఎస్ కృష్ణ  నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షకునిగా చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. గాలి సంపత్ ట్రైలర్‌ను ఈరోజు ఉదయం 10గంటల 35 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకధీరుడు రాజమౌళి లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు మూవీ టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శ్రీవిష్ణు ఏం చేయాలో తెలియనట్లు కనిపిస్తుండగా హాస్య నటుడు సత్య చేతిలో పెన్ను, పుస్తకంతో ఎదో రాయడానికి సిద్దంగా ఉన్నారు. అదే తరహాలో రాజేంద్ర ప్రసాద్ ఎదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తున్నారు. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఆ అత్రిలం ఎలా ఉండబోతుంది అనేది.

Related posts