telugu navyamedia
సినిమా వార్తలు

యూట్యూబ్ లో కేసీఆర్ బయోపిక్… ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు

udyama simham movie trailer

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా, తెలంగాణ పోరాట నేపథ్యకథతో “ఉద్యమసింహం” చిత్రం తెరకెక్కుతోంది. నటరాజన్, మాధవీరెడ్డి, జలగం సుధీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గతేడాది నవంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అప్పటి నుంచీ ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి ఈ సినిమాను మార్చి 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం విడుదల కాలేదు. కొందరు తమ సినిమా విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారని, డిస్ట్రిబ్యూటర్లను, సినిమా థియేటర్ యజమానులను థియేటర్లలో సినిమాను ప్రదర్శించవద్దంటూ బెదిరిస్తున్నారంటూ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని చిత్రనిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావు తెలిపారు. అయినాసరే ఎవరికీ భయపడకుండా యూట్యూబ్ లో సినిమాను విడుదల చేస్తున్నామని, యూట్యూబ్ లో ఎలాంటి కాపీ రైట్ సమస్య లేదని, ఈ సినిమాను ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.

Related posts