బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న విషయం తెలిసిందే. ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనాని జయించిన అనంతరం ఆయన బయటకు వచ్చి తొలిసారిగా గతంలో నాటిన మొక్కల వద్ద తీసుకున్న ఓ ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అమితాబ్ ఇంటి ఆవరణలో కొన్నేళ్ల క్రితం నాటిన మొక్క ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అది కూలిపోయింది. తాజాగా ఆయన అదే ప్రాంతంలో మరో మొక్కను నాటారు. 1976లో తాను గుల్ మొహర్ మొక్కను స్వయంగా నాటానని, భారీ వర్షాలకు ఇప్పుడది నేలకొరగడంతో, ఆగస్ట్ 12న తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ ఓ మొక్కను నాటానని బిగ్ బీ ఇంస్టా పోస్ట్ లో వెల్లడించారు.
previous post
next post
తేజ్ ప్రమాదం కాదు .. వివేకా హత్య గురించి మాట్లాడండి