telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎమ్మెల్యేలను మభ్యపెట్టింది నిజమే .. అంటున్న యడ్యూరప్ప..

yadurappa on audio tape

కర్ణాటకలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ ఎమ్మెల్యేలను మభ్యపెడుతోందని బీజేపీ పై జేడీఎస్ సభలో పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దానికి తగ్గ సాక్ష్యాలు కూడా చూపిన కుమారస్వామి వాదనలు నిజం చేస్తూ, యడ్యూరప్ప ఆడియో టేప్ లో ఉన్న గొంతు తనదేనని ఒప్పుకున్నాడు. అయితే జేడీఎస్‌ ఎమ్మెల్యే శరణగౌడను కుమారస్వామే తన వద్దకు పంపించాడని, కుతంత్ర రాజకీయాలు నడిపి, ఆడియో రికార్డు చేయించారని ఆరోపించారు. ఒరిజినల్ ఆడియోను కుమారస్వామి విడుదల చేయలేదని, ఎడిట్‌ చేసిన ఆడియోను మాత్రమే విడుదల చేశారని అన్నారు. పూర్తి ఆడియోను తాను విడుదల చేయనున్నానని చెప్పారు.

ఇంకా యడ్యూరప్ప మాట్లాడుతూ, తమది సూట్‌ కేస్‌ సంస్కృతి పార్టీ అనీ… సూట్‌ కేస్‌ లేకుంటే ఏ పని జరగదంటూ కుమారస్వామి కుటుంబీకుడు, మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ మాట్లాడిన వీడియోను తాను ప్రజలకు చూపిస్తానని అన్నారు. ఇదిలావుండగా, బీజేపీ నేత విజూగౌడ పాటిల్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం కుమారస్వామి రూ. 25 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో నేడో, రేపో బయటకు వస్తుందన్న ప్రచారం జరగటం కొసమెరుపు.

Related posts