మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సినేషన్ ప్రరమభమ్ అయ్యింది. అయితే మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగినా, తరువాత ఊపందుకుంది. సెకండ్ వేవ్ కారణంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎక్కువ మంది వ్యాక్సిన్ సెంటర్లకు వస్తున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం డిమాండ్ కు తగిన విధంగా వ్యాక్సిన్ ఉత్పత్తి లేకపోవడంతో ఇండీజీనియన్ టెక్నాలజీతో తయారు చేసిన కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు అందించి అక్కడి నుంచి కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తున్నది. ఫార్ములాను ఇతర కంపెనీలకు అందించే విషయంలో కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర కంపెనీలు కూడా వ్యాక్సిన్ ఉత్పత్తిలో భాగస్వామ్యమైతే డిమాండ్ కు తగిన విధంగా వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతుంది.
previous post
next post
రైతుల ఆందోళనలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు…