telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పౌరసత్వ సవరణ చట్టంపై “రంగీలా” హీరోయిన్ సంచల వ్యాఖ్యలు

Urmila

బాలీవుడ్ ప్రముఖ నటి, రంగీలా హీరోయిన్ ఉర్మిలా మతోండ్కర్ పౌరసత్వ సవరణ చట్టంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రౌలత్ చట్టంతో పోలుస్తూ ఈ చట్టం చరిత్రలో నల్ల చట్టంగా మిగిలిపోతుందని ఉర్మిలా మతోండ్కర్ వ్యాఖ్యానించారు. ముంబై నగరంలో గురువారం గాంధీ వర్థంతి సందర్భంగా జరిగిన ఓ సభలో ఉర్మిలా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బ్రిటీషు వాళ్లు మన దేశంలో అశాంతిని నెలకొల్పేందుకు రౌలత్ చట్టాన్ని ప్రయోగించారు…అలాగే కేంద్రం రౌలత్ చట్టం లాగే పౌరసత్వ సవరణ చట్టమనే నల్ల చట్టాన్ని తీసుకువచ్చింది’’ అని సినీనటి ఉర్మిలా ఆరోపించారు. మహాత్మాగాంధీ మన దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్త నాయకుడని, మనమంతా గాంధీజీ బాటలో నడవాలని ఆమె కోరారు.మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సే ముస్లిమ్ లేదా సిక్కు వ్యక్తి కాదని, ఆయన హిందువు అని, ఈ విషయంలో తాను ఎక్కువగా చెప్పాల్సిన పని లేదని ఉర్మిలా మతోండ్కర్ వ్యాఖ్యానించారు.

Related posts